కొండపల్లిలో ఆవులకు వింత వ్యాధి.. కళ్లలో రక్తం.. తేల్చిన వైద్యులు

కొండపల్లిలో ఆవులకు వింత వ్యాధి.. కళ్లలో రక్తం.. తేల్చిన వైద్యులు
x
Highlights

ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు భయాందోనకు గురవుతుంటే. మరోవైపు మూగ జీవాలు అంతుపట్టని రోగాలతో మృత్యువాత పడుతున్నాయి.

ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు భయాందోనకు గురవుతుంటే. మరోవైపు మూగ జీవాలు అంతుపట్టని రోగాలతో మృత్యువాత పడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో కోతులు మరణించడం సంచలనం రేపింది.కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో సుమారు 20కి పైగా కోతులు మరణించాయి. కాకులు మరణించిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కృష్ణా జిల్లాలోని కొండపల్లి గ్రామానికి చెందిన ఆవులు వింత వ్యాధితో అల్లాడిపోతున్నాయి. ఆవుల శరీరంపై ఎర్రటి మచ్చలతోపాటు కళ్ల నుంచి రక్తం రావడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న పశు వైద్యులు వెంటనే గ్రామానికి చేరుకుని 70 గోవులను పరీక్షించారు. వాటికి పొంగు జబ్బు వచ్చిందని నిర్ధారించారు.

కరోనా నేపథ్యంలో వాటికి అది సోకిందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ జంతువులకు సోకదని చెప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. పొంగు జబ్బు అంటువ్యాధని, ఒక దాని నుంచి మరోదానికి సంక్రమిస్తుందని తెలిపారు. ఈ జబ్బు శరీరం నుంచి కడుపులోకి పాకితే చాలా ప్రమాదమని వివరించారు. ఈ గోవులకు వారం పాటు చికిత్స ఉంటుందని తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories