పేగుబంధం పగబట్టడం అంటే ఇదేనేమో

పేగుబంధం పగబట్టడం అంటే ఇదేనేమో
x
Highlights

పేగుబంధం పగబట్టడం అంటే ఇదేనేమో.. తన బిడ్డను తనకు కాకుండా చేశారని ఓ ఆవు ఓ వ్యక్తిపై పగబట్టింది. దాంతో అతన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. కృష్ణా జిల్లా...

పేగుబంధం పగబట్టడం అంటే ఇదేనేమో.. తన బిడ్డను తనకు కాకుండా చేశారని ఓ ఆవు ఓ వ్యక్తిపై పగబట్టింది. దాంతో అతన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లక్ష్మీటాకీస్‌ సెంటర్‌లో గత నెల 29న గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగ దూడ చనిపోయింది. దాంతో ఆ లేగదూడ తల్లి ఆవు రోజంతా బిడ్డ వద్దే ఉండి రోదించింది. మున్సిపల్‌ సిబ్బంది ఆదేశాలతో చనిపోయిన ఆ దూడను ఓ రిక్షా కార్మికుడు తీసుకెళ్లి ఖననం చేశాడు.

దాంతో ఆ తల్లి ఆవు ఆ రిక్షా కార్మికుడిపై పగబట్టింది. బిడ్డను తనకు కాకుండా తీసుకెళ్లిపోయాడని పగబట్టింది. అతను ఎక్కడ కనిపించినా కొమ్ములతో పొడిచి గాయపరుస్తోంది. శుక్రవారం రాత్రి బస్టాండ్‌ సెంటర్‌లో కన్పించిన ఆ వ్యక్తిపై దాడి చేసిందావు. స్థానికులు గమనించి రక్షించడంతో అతడు ప్రాణాలు దక్కించుకున్నాడు.అనవసరంగా మృత లేగదూడను తీసుకెళ్లానని.. ఇప్పుడు దాని బారి నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాక తలపట్టుకున్నాడు ఆ కార్మికుడు.

Keywords : cow attacks, rickshaw puller, machilipatnam


Show Full Article
Print Article
More On
Next Story
More Stories