ఏపీలో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ ‌లో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ ‌లో వెల్లడించింది. నిన్న ఉదయం 9 గంటలనుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకూ మొత్తం 9664 శాంపిల్స్ ను పరీక్షించారు. దీంతో 68 కేసులొచ్చాయి. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2787కి చేరింది. నిన్న తూర్పు గోదావరిలో ఒకరు మృతి చెందారు.

కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 58 మంది మృతి చెందారు. అలాగే నిన్న 10 మంది కోలుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1913 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 816 యాక్టీవ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన 68 కేసులలో నెల్లూరులో 8 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 9 మంది వచ్చారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా రోజూ 40 కి పైగా డిశ్చార్జ్ లుండగా ఈరోజు కేవలం 10 మాత్రమే వచ్చాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories