ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి.. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ‌లో కొత్తగా 98కేసులు నమోదైనట్లు పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3042కి చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో మరొకరు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 62 కి చేరింది. ఇక తాజాగా 43 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2135 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 845 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో మొత్తం 9,370 శాంపిల్స్ ను పరీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో మగ్గురు చిత్తూరులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 86,983 మంది డిశ్చార్జ్ కాగా.. 5,164 మంది మృతిచెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories