ఏపీలో కొత్తగా 232 పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 232 పాజిటివ్ కేసులు
x
Highlights

ఏపీలో కొత్తగా 232 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 232 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 40,177 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌19 కేసుల సంఖ్య 8,83,082కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,115కి చేరింది. ఒక్కరోజులో 352 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 3,070 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,19,72,780 నమూనాలను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories