మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు అనుమతి

Court Given Permission To Minister Peddireddy Ramachandra Reddy
x

ఫైల్ ఇమేజ్

Highlights

రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు...

రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఇంట్లో నుంచి బయటకు రాకూండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ. మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు వెలువరించనుంది.

రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories