Top
logo

హోటల్‌ రూములో దంపతుల ఆత్మహత్య

హోటల్‌ రూములో దంపతుల ఆత్మహత్య
Highlights

హోటల్‌ రూములో దంపతుల ఆత్మహత్య హోటల్‌ రూములో దంపతుల ఆత్మహత్య

అప్పుల బాధకు తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన దంపతులు దుడ్డు ఎస్‌వీఆర్‌ పవన్‌ (50), దివ్యలక్ష్మి (45) ఆదివారం అన్నవరం వచ్చి ఓ హోటల్‌లో దిగారు.

రెండురోజులపాటు బయటికి రాకుండా రూమ్ లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఎంతసేపటికీ వారు గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్‌ నిర్వాహకులకు అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచారు. దాంతో దంపతులిద్దరూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవులై కనిపించారు. వెంటనే హోటల్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతులు బస చేసిన గదిలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. అందులో అప్పుల బాధ తాళలేక, అవి తీరే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Next Story