Andhra Pradesh: సెలక్ట్ కమిటీ ప్రాసెస్ మధ్యలోనే నిలిచిపోయింది: బాంబ్ పేల్చిన చైర్మన్

Andhra Pradesh: సెలక్ట్ కమిటీ ప్రాసెస్ మధ్యలోనే నిలిచిపోయింది: బాంబ్ పేల్చిన చైర్మన్
x
Highlights

సెలక్ట్ కమిటీకి పంపించే ప్రాసెస్ మధ్యలో నిలిచిపోయిందని మండలి చైర్మన్ షరీఫ్ బాంబ్ పేల్చారు.

సెలక్ట్ కమిటీకి పంపించే ప్రాసెస్ మధ్యలో నిలిచిపోయిందని మండలి చైర్మన్ షరీఫ్ బాంబ్ పేల్చారు. ప్రాసెస్ అయితేనే కానీ సెలెక్ట్ కమిటీకి వెళ్ళదని స్పష్టం చేశారు. తన విచక్షణ అధికారాలు ఉపయోగించే అధికార వికేంద్రీకరణ, crda రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించానని మండలిలో చెప్పిన షరీఫ్.. తాజా వ్యాఖ్యలు చూస్తుంటే స్వరం మారినట్టు అర్ధమవుతోంది. పదకొండు నిమిషాల పాటు ప్రసంగించిన చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించగానే సభలో గందరగోళం నెలకొంది. చైర్మన్ తన ఆదేశాలను ప్రకటించగానే అధికార పక్ష సభ్యులు, మంత్రులు చైర్మన్ నిర్ణయంపై మండిపడ్డారు.

దాంతో చైర్మన్ ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అంతేకాదు మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించకుండా కేవలం సంతకం మాత్రమే పెట్టి వెళ్లిపోయారు. మండలి నిరవధికంగా వాయిదా పడిన విషయాన్నీ కూడా టీడీపీ సభ్యులే వెల్లడించారు. మండలిలో జరిగిన గందరగోళం నేపథ్యంలో బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయినట్టు చైర్మన్ భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మళ్ళీ మండలిని సమావేశపరచి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా లేక సెలెక్ట్ కమిటీని వేస్తారా అనేది ఇంకా తెలియరాలేదు.

మరోవైపు మండలిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. సోమవారం స్పీకర్ అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టి మండలిని కొనసాగిద్దామా లేదా అనే విషయంపై చర్చిద్దామని స్పీకర్ ను అభ్యర్ధించారు. దాంతో స్పీకర్ కూడా అలాగే చర్చిద్దామని అన్నారు. అమరావతి విభజనకు సంబంధించి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మండలి రద్దు దిశగా అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు ఎంతో బాధ కలిగించాయని ముఖ్యమంత్రి అన్నారు. 6 రాష్ట్రాల్లోనే మండలిలు ఉన్నాయని.. ప్రజలకు మంచి చేయడం కోసం మండలి అనేది ఉండాలి కానీ.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రూల్స్ తో సంబంధం లేకుండా ఉండే మండలిని కొనసాగించడం అవసరమా? అని పేరొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories