Coronavirus: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు

Coronavirus: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకూ) 11,357 సాంపిల్స్ ని పరీక్షించగా.. 66 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అలాగే 29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2627 పాజిటివ్ కేసులకు గాను 1807 మంది కోలుకోవడంతో వివిధ జిల్లాలోని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.. అలాగే 56 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందుతున్నవారి సంఖ్య 764గా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories