Coronavirus: ఏపీలో మరో 52 కొత్త కేసులు.. యాక్టీవ్ కేసుల సంఖ్య చూస్తే..

Coronavirus: ఏపీలో మరో 52 కొత్త కేసులు.. యాక్టీవ్ కేసుల సంఖ్య చూస్తే..
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య ఏపీలో 2282 కు చేరింది. అయితే ఇవాళ 94 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూరు లో 12 , నెల్లూరులో 7 , కోయంబేడు(తమిళనాడు) నుంచి 19 మంది వచ్చారు. ఇతర రాష్ట్రానికి(గుజరాత్) కు చెందిన ఇద్దరు రోగులు కోలుకోవడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలావుంటే రాష్ట్రంలో ప్రస్తుతం 705 యాక్టీవ్ కేసులుండగా.. మొత్తం 1527 మంది కోలుకున్నారు. 50 మంది మరణించారు. ఇక జిల్లాల వారీగా యాక్టీవ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు 110, ప్రకాశం 3, నెల్లూరు 60, అనంతపురం 45, పచ్చిమగోదావరి 21, గుంటూరు 94, కృష్ణ 104, కడప 35, కర్నూల్ 163, తూర్పు గోదావరి 14, విశాఖపట్నం 38, విజయనగరం 8, శ్రీకాకుళం 10గా ఉన్నాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories