గుంటూరులో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు.. ఆ ఒక్క చోటే 27 కేసులు

గుంటూరులో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు.. ఆ ఒక్క చోటే 27 కేసులు
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో కొత్తగా మరో 8 కేసులు నమోదైనట్టు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో కొత్తగా మరో 8 కేసులు నమోదైనట్టు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ వెల్లడించారు. వీటిలో గుంటూరు నగరంలోనే 27 కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో ఉదయం నమోదైన ఒక కేసుతో ఈ రోజు ఒక్క రోజు తొమ్మిది కేసులు గుంటూరులోనే నమోదు కావడంతో జిల్లాలో అధికారులు మరింత అప్రమత్తమైంది. ఇప్పటివరకు గుంటూరులో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41కి చేరిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 312కు చేరుకున్నాయి.

క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా 74 కేసులు న‌మోదైయ్యాయి. క‌ర్నూలు జిల్లాలో క‌రోనా వైర‌స్ వ‌లన‌ ఒకరు మ‌ర‌ణించారు. నెల్లూరులో(42), కృష్ణ జిల్లా(29), విశాఖ‌ప‌ట్నం( 20)క‌డ‌ప (27) గుంటూరు(41), చిత్తూరు(17), ప్ర‌కాశం(24), తూర్పుగోదావ‌రి(11), ప‌శ్చిమ‌గోదావ‌రి(21), అనంత‌పురం(6), న‌లుగురు మ‌ర‌ణించ‌గా.. ఆరుగురు కోలుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories