ఏపీలో ఆ నాలుగు జిల్లాల ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..

ఏపీలో ఆ నాలుగు జిల్లాల ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ ను కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగపోతోంది.

ఆంధ్రప్రదేశ్ ను కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగపోతోంది. గత రెండు రోజులుగా 150కిపైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెరగడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. రెడ్‌జోన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ నిత్యావసరాలు, మందులు వంటివి వాలంటీర్ల సాయంతో ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు. పోలీసులు ప్రజలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం సమయంలో కూడా జనాల్ని బయటకు రానివ్వడం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా 4 జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది. కర్నూలు జిల్లాలో (261) గుంటూరు జిల్లా (206) కేసులు 466 చేరుకున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసులలో ఈ రెండు జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. ఇక కృష్ణా జిల్లాలో 102 చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోనే ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్య ఆంధ్ర ట్వీట్ చేసింది. ఈ జిల్లాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటకు వస్తే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories