Coronavirus: వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పరీక్షలు

Coronavirus: వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పరీక్షలు
x
Highlights

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నం నాలుగు కేసులు నమోదు కాగా గుంటూరులో 2కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు గుంటూరు ప్రజలను కరోనా టెన్షన్ పెడుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం చెందిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలను కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్‌ సోకిందన్న అనుమానంతో ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్‌కి తరలించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన ఎమ్మెల్యే బావమరిది ఇచ్చిన విందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తర్వాత కొద్ది రోజులకే ఎమ్మెల్యే బావమరిదికి, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఎమ్మెల్యేకు కూడా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో ఐసోలేషన్‌కి తరలించారు.

గుంటూరులోని ఓ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం మీద ఎమ్మెల్యేకు కరోనా సోకిందా లేదా తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఐసొల్యూషన్ ఉండక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా 13మంది కరొనా పాజిటివ్ కేసులు తెలగా.. మరో 400 మంది పరీక్షలు నిర్వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories