కర్నూలు డాక్టర్ ఇంట్లో ఆరుగురికి కరోనా.. ఓ మహిళ వైద్యురాలికి కూడా..

కర్నూలు డాక్టర్ ఇంట్లో ఆరుగురికి కరోనా.. ఓ మహిళ వైద్యురాలికి కూడా..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 250 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 250 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ లక్షణాలు ఉన్నవారు స్వచ్చందంగా ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 126 కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో నలుగురు చనిపోయారు. శుక్రవారం ఒక్కరోజే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 18 కేసులు నమోదయ్యాయి.

శుక్రవారం నమోదైన కేసుల్లో 6 కేసులు ఇటీవల మరణించిన కర్నూలు ప్రైవేట్ వైద్యుడి కుటుంబ సభ్యులువిగా తేలాయి. అలాగే కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కూడా కరోనా వైరస్ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడితో చికిత్స చేయించుకున్నారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఏపీలో గుంటూరు, కర్నూలు జిల్లాలు కేసుల సంఖ్య పెరిగపోతోంది. రాష్ట్రంలో ఇంత వరకు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 126 కేసులు చొప్పున నమోదయ్యాయి. అలాగే ఇంకా పరీక్షలు కొనసాగుతుండటంతో మరిన్ని పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories