గుంటూరులో ప్రమాద ఘంటికలు.. వైద్యురాలికి కరోనా

గుంటూరులో ప్రమాద ఘంటికలు.. వైద్యురాలికి కరోనా
x
Highlights

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజూ రోజుకు కరోనా కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయి.

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజూ రోజుకు కరోనా కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయి.గుంటూరు జిల్లాలో గురువారం ఒక్క రోజే 18 కేసులు రావడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 194కు చేరింది.

దాంతో వైద్యవర్గాల్లో కలవరం మొదలైంది. జిల్లాలో రెండు రోజులలో ఒక ప్రభుత్వ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, ఓ ప్రైవేటు ఆసుపత్రి మహిళ డాక్టర్, అక్కడ పని చేస్తున్న 4 స్టాఫ్‌నర్సులకు వైరస్‌ సోకింది. జిల్లాలో ఓ ప్రభుత్వ పీజీ డాక్టర్‌కి పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రైవేటు వైద్యురాలు పనిచేస్తున్న ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అక్కడ పనిచేస్తున్న నలుగురు సిబ్బందితోపాటు చికిత్స పొందడానికి వచ్చిన మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది.

మొదట పాజిటివ్‌ వచ్చిన వారికి 14 రోజుల చికిత్స అనంతరం తిరిగి పరీక్షలు చేయగా నలుగురికి మరోసారి పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. దీంతో వీరిని 14 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి పర్యవేక్షిస్తామని వైద్యులు సూచించారు. ఇటీవలే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories