సీఎం నివాసానికి సమీపంలో కరోనా కేసులు.. అలర్టయిన అధికార యంత్రాంగం

సీఎం నివాసానికి సమీపంలో కరోనా కేసులు.. అలర్టయిన అధికార యంత్రాంగం
x
Highlights

సీఎం జగన్మోహనరెడ్డి కొంతకాలం క్రితం అన్నట్టు కరోనా ఎవరికైనా రావచ్చు... ఆందోళన చెందవద్దు, దాన్నిఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఇచ్చిన పిలుపు...

సీఎం జగన్మోహనరెడ్డి కొంతకాలం క్రితం అన్నట్టు కరోనా ఎవరికైనా రావచ్చు... ఆందోళన చెందవద్దు, దాన్నిఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఇచ్చిన పిలుపు మాదిరిగానే తన నివాసానికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో కరోనా బాధితులు బయటపడటంతో కలకలం రేగింది... వీరిలో స్తానికులతో పాటు ఇద్దరు వాలంటీర్లు ఉన్నారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాస సమీపంలో కరోనా కలకలం రేపింది. జగన్ నివాసానికి అతి చేరువలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేటలో ఈ రోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు వాలంటీర్లు కూడా ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటైజేషన్ పనులను చేస్తున్నారు. కాగా వాలంటీర్లు ఇద్దరు గత మూడు రెండు క్రితం తాడేపల్లిలో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. మరోవైపు వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారన్న వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు.

కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3373కు చేరుకోగా.. అందులో 2273 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులు ఉండగా.. మరణించిన వారి సంఖ్య 71కు చేరింది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో 119 మందికి కరోనా నిర్ధారణ కాగా.. నలుగురు కోలుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 616 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అందులో ప్రస్తుతం 372 మంది చికిత్స పొందుతున్నారు.


Show Full Article
NO MORE UPDATES
Print Article
More On
Next Story
More Stories