తెలుగు రాష్ట్రాలకు మర్కాజ్ సెగ.. కదంతొక్కుతున్న కరోనా!

తెలుగు రాష్ట్రాలకు మర్కాజ్ సెగ.. కదంతొక్కుతున్న కరోనా!
x
corona positive cases details (file photo)
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వారం వరకు తక్కువగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఢిల్లీ తబ్లీగ్ జమాతేకు వెళ్లి వచ్చిన వారితో ఒక్కసారిగా...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వారం వరకు తక్కువగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఢిల్లీ తబ్లీగ్ జమాతేకు వెళ్లి వచ్చిన వారితో ఒక్కసారిగా పెరిగింది. ఈ కౌంట్ విషయంలో ఏపీ, తెలంగాణలో అలజడి రేగింది. జమాతేకు వెళ్లివచ్చిన వారితో పాటు వాళ్ల బంధువులు, కలిసిన వారికి కరోనా సోకింది.

ఇప్పటి వరకు ఏపీ నుంచి తబ్లీగ్ జమాతే‌కు వెళ్లిన వారు 1085 మందిగా గుర్తించారు. ఇందులో రాష్ట్రంలో 946 మంది ఉన్నారు. వీరిలో 881 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. వీరిలో 108 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ఇక జమాతేకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్ అయిన వారు 613 మంది. వీరిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది.

ఏపీలో ఇప్పటి వరకు 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 140 మంది ఢిల్లీ జమాతే‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారు. ఇంకా ఎవరైన వీరితో కాంటాక్ట్ అయ్యారా..? ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా..? అనే అంశంపై విచారణ జరుగుతోంది.

ఇక తెలంగాణలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి కూడా ఢిల్లీ మూలాలే కారణం. గురువారం 27 మందికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో కేసుల సంఖ్య 154కు చేరింది. ఈ మొత్తం కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు, వారి బంధువులే 86 మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు మొత్తం 9 మంది చనిపోయారు.

ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారు తెలంగాణలో వెయ్యికి పైగా ఉన్నట్టు గుర్తించారు. వారు వేలాది మందిని కాంటాక్ట్ అయినట్టు అంచనా వేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ఢిల్లీ వెళ్లడంతో రాష్ట్రమంతా లాక్‌ డౌన్ సీరియస్‌గా అమలు చేస్తున్నారు. అయినా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఎంత మందితో కాంటాక్ట్ అయ్యారో చెప్పలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories