Coronavirus: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది.

Coronavirus: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది.
x
Highlights

గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం కొత్తగా 22 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం కొత్తగా 22 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కోటి ఉన్నాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 427కి పెరిగింది. గుంటూరులో ఒకరు మృతి చెందారు.

రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. విజయవాడ జీజీహెచ్‌ నుంచి 65 ఏళ్ల వృద్ధుడు డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 12కి చేరింది. చిత్తూరు జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం నారాయణపురం చెందిన రోగి ఊపిరి సంబంధిత సమస్యతో పిడుగురాళ్ల ఆసుపత్రిలో ఈనెల 9న చేరారు. అక్కడినుంచి గుంటూరు ఐడీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. నమూనాలు సేకరించి పరీక్షించగా.. కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. ఈ రోగి పదో తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మృతిచెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

గుంటూరు జిల్లాలో రెండు రోజుల్లో 31కేసులు నమోదయ్యాయి. ఆదివారం వరకు 7 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్‌లో ప్రకటించింది. ఆ తర్వాత మరో 7 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఒకే ఇంట్లో నలుగురు బాధితులున్నారు. ఈ 7 కేసులను వైద్య, ఆరోగ్యశాఖ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

జిల్లాల వారిగా చూస్తే..

కర్నూలు 84 , గుంటూరు 87, నెల్లూరు 52, చిత్తూరు 23 , అనంతపురం 15 , కృష్ణాజిల్లా 35 , కడప 31, ప్రకాశం జిల్లా 41, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 22, విశాఖపట్నం 20, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత మూడు రోజులుగా విశాఖలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories