రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం

X
Highlights
రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం రేపింది. ఈనెల 21 బ్రిటన్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నమహిళకు...
K V D Varma24 Dec 2020 6:05 AM GMT
రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం రేపింది. ఈనెల 21 బ్రిటన్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నమహిళకు పాజిటీవ్ నిర్ధారణ అయ్యినట్లు అక్కడ అధికారులు గుర్తించారు. పాస్ పోర్ట్ ఆధారంగా ఆమె రాజమండ్రికి చెందిన మహిళగా గుర్తించటంతో తూర్పుగోదావరి జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
ఢిల్లీ నుంచి ఎ.పి. ఎక్స్ ప్రెస్ లో గత అర్థరాత్రి రాజమండ్రి రైల్వేస్టేషన్ కు చేరుకున్న మహిళతోపాటు ఆమె కుమారుడికీ పి.పి.ఇ. కిట్లు వేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరళించారు. మరోవైపు మహిళకు నిర్థారణ అయ్యింది పాత కరోనా వైరస్సా లేక బ్రిటన్ నుంచి వచ్చిన నేపథ్యంలో కొత్త కరానోనా అని ఇంకా అధికారికంగా నిర్థారణ కాలేదు. నేడు రక్త నమూనాలను సేకరించి పూణే ల్యాబ్ కు పంపనున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు ప్రత్యేక ఐసొలేషన్ గదులను వైద్య అధికారులు ఏర్పాటు చేశారు.
Web TitleCoronavirus New strain suspected case found in Rajahmundry
Next Story