ఏపీలో 348 చేరిన కరోనా పాజిటివ్ కేసులు..

ఏపీలో 348 చేరిన కరోనా పాజిటివ్ కేసులు..
x
Representational Image
Highlights

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజా ఇవాళ తొమ్మిది గంటల్లో మ‌రో 34 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయ‌ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజా ఇవాళ తొమ్మిది గంటల్లో మ‌రో 34 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయ‌ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. గుంటూరులో 8, అనంతపురంలో ఏడు , ప్రకాశంలో జిల్లాలో మూడు, పశ్చిమ గోదావరిలో ఒకరికి పాజిటివ్ తేలింది. కాగా.. విశాఖలో ముగ్గురు రోగులు కోలుకున్నారు. తాజా కేసులుతో ఏపీలో 348మంది క‌రోనా సోకిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్పటి వరకు 9 మంది వైరస్ నుంచి కోలుకోగా.. నలుగురు ఈ మ‌హమ్మ‌రి బ‌రిన‌ప‌డి మ‌ర‌ణించారు.

కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మొత్తం 1000 కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్స్ ద్వారా 50 నిమిషాల్లోనే క‌రోనా వైర‌స్ టెస్టింగ్ రిపోర్ట్ తెలుసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖ‌రు లోగా రాష్ట్రంలో నాలుగు వేల‌ప‌రీక్ష‌లు చేస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

జిల్లాల వారిగా కేసుల వివ‌రాలు చూస్తే..

మొత్తంగా ఏపీలో 335 యాక్టివ్ కేసులున్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు ఉంటే , తర్వాత స్థానాల్లో గుంటూరులో 49, నెల్లూరులో 48 మందికి కరోనా వైరస్ సోకింది. అనంత‌పురం 13, చిత్తూరు 20, తూర్పూగోదావ‌రి 11, క‌డ‌ప జిల్లా 28, కృష్ణా జిల్లాలో 35, ప్ర‌కాశంలో 27, విశాఖ‌ప‌ట్నంలో 20, ప‌శ్చిమ‌గోదావ‌రి 22 కేసులు న‌మోదైయ్యాయి. ఇక విజ‌య‌న‌గరం, శ్రీకాకుళంలో క‌రోనా కేసులు న‌మోదు కాలేదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories