Top
logo

రాజమండ్రిలో కాలిన స్థితిలో శవాలు.. ఆందోళనలో ప్రజలు

రాజమండ్రిలో కాలిన స్థితిలో శవాలు.. ఆందోళనలో ప్రజలు
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో దంపతుల మృతదేహాలు కలకలం రేగింది.

తూర్పుగోదావరి జిల్లాలో దంపతుల మృతదేహాలు కలకలం రేగింది.రాజమహేద్రవరలోని ప్రకాశ్ నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చెట్ల పొదల్లో దంపతుల మృతదేహాలను సగం కాలిన స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతులను ఆటోడ్రైవర్ రాజేష్, వెంకట లక్ష్మీ దంపతులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలంలో ఆత్మహత్యకు ఉపగించిన కిరోసిన్ బాటిల్, సూసైడ్ నోట్ లభ్యమైంది. దాని ఆధారగానే పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు మాత్రం ఎవరైనా వీరిని హత్య చేశారా? వీరే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు త్వరలోనే ఈ కేసును చేధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెబుతున్నారు.

Web TitleCoronavirus is the cause suspicious couple death in Rajahmundry
Next Story


లైవ్ టీవి