ఏపీలోని మరో రెండు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్

ఏపీలోని మరో రెండు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లో లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈ నెల 25 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిబంధనలు చూస్తే..

* రెస్టారెంట్లు, హోటళ్ళు, షాపింగ్‌ మాల్స్‌, వ్యాపారులకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి

* అత్యవసర, వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ఆర్థిక రంగ సంస్థలు అన్నీ యథావిధిగా పనిచేయనున్నాయి.

*శుభకార్యాలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు తహసీల్దారు, ఆర్డీవోల అనుమతి తప్పనిసరి

* కార్యక్రమాలకు పది మందిని మాత్రమే అనుమతిస్తారు.

*మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తారు.

దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా ట్వీట్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో కూడా లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఏలూరు నగరంలోని 3, 4, 8, 9, 12, 14, 39, 40, 46, 48 డివిజన్లలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వుండటంతో లాక్ డౌన్ అమలు చేయనుననట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. లాక్ డౌన్ 14 రోజుల నుంచి 28రోజులు ఉండే అవకాశం ఉందంటున్నారు.

* పది డివిజన్లలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌

*ఉదయం 6గంటల నుంచి 11వరకు మాత్రమే ప్రజలు తిరిగేందుకు అనుమతి.

*ఉదయం 11గంటలు దాటిన తర్వాత నగరం లోపలికి గానీ, నగరం నుంచి బయటకు వెళ్లే అనుమతి లేదు

*అత్యవసర సమయంలో మెడికల్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసులకు వెసులుబాటు

ఇప్పటికే రాష్ట్రంలో ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories