ఏపీలో ఆగని కేసులు.. రెండు జిల్లాలు టాప్

ఏపీలో ఆగని కేసులు.. రెండు జిల్లాలు టాప్
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతి తీవ్రమైంది. శనివారం రాత్రి కి 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతి తీవ్రమైంది. శనివారం రాత్రి కి 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 194కి చేరింది. మరో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ధ్రువీకరించలేదు. ముఖ్యంగా నెల్లూరు, కృష్ణా జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో కూడా 30 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరగకుండా వుండేందుకు అధికారులు లాక్‌డౌన్ పటిష్టంగా అమలయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్ని రెడ్ జోన్లుగా ప్రకటి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇక కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కేసులకు కారణం ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళినవారు, వారితో కొంటాక్ట్ వున్నవారు అని తెలిసింది. శనివారం గుంటూరు జిల్లలో నమోదైన 10 కేసుల్లో ఏడుగురు నగరానికి చెందినవారు కావడం, వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

జిల్లాలోని కొన్ని జిల్లాలో చాలా మంది అనుమానిత కేసులున్నాయి. వాటి రిపోర్టులు వస్తే పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. విజయవాడలో రెండు ఆస్పత్రుల్ని పూర్తిగా కొవిడ్-19 అనుమానితులు, బాధితులకు వైద్యం అందిస్తున్నారు. కడపలో 23కి చేరింది. విశాఖలో కరోనా కేసులు పెరగడంతో... జోన్ 4ను రెడ్ జోన్‌గా మార్చారు. ఇక్కడ కూడా ఢిల్లీ లింకులు బయటపడ్డాయి. అటు కర్నూలు జిల్లా నుంచి 449 మంది ఢిల్లీ జమాత్‌కి వెళ్లారు. వాళ్ల శాంపిల్స్ పంపించగా, 350 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వైద్యశాఖ, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి పూర్తి జీతం చెల్లించాలని ఆదేశించింది కేంద్రం నుంచి ఏపీకి భారీగా మెడికల్ కిట్లను పంపింది. అవి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. అక్కడి నుంచి స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లాయి.

జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన కేసు వివరాలు చూస్తే..

కృష్ణాజిల్లా 32 , నెల్లూరు 32 అత్యధిక కేసులు నమోదయ్యాయి. గుంటూరు 30, కడప 23 , ప్రకాశం 19, విశాఖపట్నం 15 ,పశ్చిమగోదావరి 15 తూర్పుగోదావరి 11 , చిత్తూరు 10, కర్నూలు 4, అనంతపురం 3, కేసు నమోదు అయ్యాయి. అధికారికంగా ఒక వ్యక్తి కరోనా బారిన పడి మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories