నిట్ విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు.. మార్కులు కుదించిన యాజమాన్యం

నిట్ విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు.. మార్కులు కుదించిన యాజమాన్యం
x
Highlights

కరోనా నేపథ్యంలో ఇప్పటికిప్పుడే తరగతులు పెట్టే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ దిశవైపు అడుగులు వేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికిప్పుడే తరగతులు పెట్టే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ దిశవైపు అడుగులు వేస్తున్నారు. సంబంధిత యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఏపీ నిట్ ఇదే తరహాలో మార్కులు కుదించి, పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి, ప్రకటించింది.

నిట్ విద్యార్ధులకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ నేపధ్యంలో పరీక్షలు కేవలం 25 మార్కులకు రాస్తే చాలు.. పైతరగతులకు ప్రమోట్ చేస్తామని నిట్ డైరెక్టర్ సీఎస్‌పీ రావు తాజాగా ఓ ప్రకటనను జారీ చేశారు. మల్టీపుల్ ఛాయస్ పద్దతిలో క్వశ్చన్ పేపర్ ఉంటుందని.. గంట వ్యవధిలో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రాయాల్సి ఉంటుందని వివరించారు. అయితే వివిధ కారణాల వల్ల ఎవరైనా ఈ ఆన్లైన్ పరీక్షలు రాయలేకపోతే.. వారికి కళాశాల రీ-ఓపెన్ అయ్యాక 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు.

ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్ధులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లో నిర్వహించనుండగా… దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా నిట్ డైరెక్టర్ సీఎస్‌పీ రావు ప్రకటించారు. ప్రతీ పేపర్‌కు 100 మార్కులకు గాను.. ఇంటర్నల్స్‌ 35 మార్కులు, మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షలకు 40 మార్కులు వేయనుండగా, ఇక మిగిలిన 25 మార్కులకు ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు.

ఇప్పటికే ఆన్లైన్ విధానం ద్వారా చివరి సంవత్సరం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించామని.. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని.. దీనితో మిగిలిన సంవత్సరాల విద్యార్ధులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి కారణాల వల్ల గానీ పరీక్షలకు విద్యార్ధులు రాయలేకపోతే.. వారికి కళాశాల పునః ప్రారంభం అయ్యాక 50 మార్కులకు పరీక్ష పెడతామన్నారు.

కాగా, కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఇప్పటికే పలు జాతీయ విద్యాసంస్థలు పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఏపీ నిట్ కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారని.. వారికి సరైన ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయాలు ఉండవని తెలిపారు. అంతేకాకుండా మరెన్నో సమస్యలతో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories