LockDown Effect : త‌గ్గిన‌ క్రైమ్ రేట్

LockDown Effect : త‌గ్గిన‌ క్రైమ్ రేట్
x
Representational Image
Highlights

Coronavirus and LockDown Effect crime rate reduced in andhrapradesh

లాక్‌డౌన్ వ‌ల్ల రాష్ట్రంలో నేరాలు చాలా వ‌ర‌కు తగ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప‌రిస్థితులు లేకపోవటంతో ఘర్షణలకు, హత్యలకు అడ్డుక‌ట్ట ప‌డ్డాయి. రోడ్డు ప్ర‌మాదాలు భారీ స్థాయిలో త‌గ్గాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు నిలిచిపోవటంతో రోడ్డు ప్ర‌మాదాలు బాగా తగ్గాయి. అంతా ఇళ్లలోనే ఉంటుండటంతో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోయింది. సాధారణంగా వేసవిలో దొంగతనాలు అధికం. లాకడౌన్​తో గత 19 రోజుల్లో కేవలం 16 చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ ప్ర‌భావంతో దేశంలో గ‌ణ‌నీయంగా నేరాలు త‌గ్గాయి.

గతేడాది మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 10 మధ్య రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నేరాలతో పోల్చితే ఈ ఏడాది అదే కాలవ్యవధిలో జరిగిన వివిధ రకాల నేరాలు గణనీయంగా తగ్గాయి.మరణాలు సంభవించిన రోడ్డు ప్రమాదాలు 70%, మరణాలు చోటుచేసుకొని రోడ్డు ప్రమాదాలు 76% తగ్గాయి. హత్యలు53%, హత్యయత్నాలు 62% తగ్గుముఖం పట్టాయి. అయితే రాష్ట్రంలో దొంగ‌త‌నాలు త‌గ్గిన‌ప్ప‌టికీ అత్యధిక శాతం చోరీలు మద్యం దుకాణాల్లో జరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. మ‌రి కొన్ని చోట్ల‌ మందుబాబులకు మ‌ద్యం దుకాణాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో నేరాల‌కూ అడ్డుక‌ట్ట ప‌డింది.


Show Full Article
Print Article
Next Story
More Stories