ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మరోసారి సర్వే

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మరోసారి సర్వే
x
Botsa Satyanarayana (File Photo)
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజూకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజూకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురవుతున్నారు. బుధ‌వారం ఒక్క‌రోజే 43 కేసులు న‌మోదైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో అనధికారికంగా 87 కేసులు న‌మోదు కావ‌డంతో మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని కీలక విషయాలు చెప్పారు. ప్ర‌భుత్వ అప్రమత్తంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని పర్యవేక్షిస్తున్నామన్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉందనీ బొత్స అన్నారు.

ఢిల్లీలో మ‌త‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కోవిడ్ పాజిటివ్ లక్షణాలు క‌నిపిస్తున్నాయ‌ని బొత్స వ్యాఖ్యానించారు. మరోసారి ఆరోగ్య సర్వే పూర్తిస్థాయిలో చేయిస్తున్నామని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శాఖకు నిధులు మంజూరు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ నెల 15 వరకూ రేషన్ ఇస్తామని అయితే ఒక్కో రేషన్ డీలర్‌నూ .. మూడు రేషన్ డీలర్లుగా విభ‌జించి రేషన్ సరుకులు ఇస్తామని స్పష్టం చేశారు. దాని ద్వారా జన గుంపు కూడే అవ‌కాశం ఉండ‌ద‌ని తెలిపారు. రేషన్ సరుకులు ఈ నెల 15 వ‌ర‌కు ఇస్తాం కాబ‌ట్టిఎక్కుక‌వ మంది గుంపులుగా రేష‌న్ దుకాణాల‌కు వెల్లొద్ద‌ని బొత్స కోరారు.

ఆరోగ్య సర్వే ద్వారా అనారోగ్య స‌మ‌స్య క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని క్వారంటైన్‌లో ఉంచి ప‌ర్య‌వేక్షిస్తే.. కరోనా కంట్రోల్ అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. క‌రోనా ఏపీలో పెరిగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రకాశం 15, కడప 15, పశ్చిమగోదావరి 13, విశాఖ 11, కృష్ణా 6, కర్నూలు 1, నెల్లూరు 3. అనంతపురం 2, చిత్తూరు 6, తూర్పుగోదావరి 6, గుంటూరు 9, కేసులు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. మ‌రో వైపు తెలుగు రాష్ట్రం అయినా తెలంగాణ‌లోనూ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories