కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్' రంగం సిద్ధం

కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్ రంగం సిద్ధం
x
Highlights

* ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలు ఎంపిక * ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రక్రియ * ఒక్కొక్క సెంటర్‌కు ఐదుగురు వ్యాక్సినేషన్‌ ఆఫీసర్ నియమకం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ టైం రానే వచ్చింది. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు రంగం సిద్ధమైంది. ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలను ఇందుకోసం ఏర్పాటు చేశారు. ఏపీలోని కృష్ణ జిల్లాలో డ్రైరన్ కోసం ఎంపిక చేశారు. కలెక్టర్ అధ్యక్షతన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది. ఐదు సెంటర్‌లలో పోలీంగ్ కేంద్రం తరహాలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ ఏర్పాటయింది.

ఒక్కొక్క సెంటర్‌కు ఐదుగురు వ్యాక్సినేషన్‌ ఆఫీసర్లను నియమించారు. ప్రతి సెంటర్‌లో ఎంపిక చేసిన 25 మంది ద్వారా డ్రై రన్ నిర్వహించనున్నారు. డ్రై రన్‌లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణా కార్యక్రమం పూర్తయింది. లోపాలు గుర్తించి అధిగమించడమే ప్రధాన లక్ష్యంగా డ్రైరన్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories