ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.. అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్

X
Highlights
నిన్న అసెంబ్లీలో కరోనా టెస్టు చేయించగా.. పాజిటివ్ అని వెల్లడైందని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. గత జులైలో అంబటికి కరోనా సోకగా.. కొన్నిరోజులకే ఆయన కోలుకున్నారు.
admin5 Dec 2020 1:24 PM GMT
ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. సభ జరిగిన ఐదు రోజుల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. దీంతో మిగిలిన సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మూడు రోజుల క్రితం తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా సోకడం కలకలం రేపుతోంది. నిన్న అసెంబ్లీలో కరోనా టెస్టు చేయించగా.. పాజిటివ్ అని వెల్లడైందని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. గత జులైలో అంబటికి కరోనా సోకగా.. కొన్నిరోజులకే ఆయన కోలుకున్నారు. అయితే మళ్లీ రీ ఇన్ఫెక్షన్కు గురికావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరతానని, ప్రజల ఆశీస్సులతో కొవిడ్‌ను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు.
Web TitleCorona positive for Ambati Rambabu for the second time
Next Story