AP Schools - Corona Tension: ఏపీ స్కూళ్లలో కరోనా టెన్షన్

AP Schools - Corona Tension: విశాఖలో ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్, పాఠశాల ప్రాంగణం,విద్యార్థుల ఇళ్ల దగ్గర శానిటేషన్

Shireesha
Published on: 26 Aug 2021 10:52 AM IST
Corona Positive Cases Increasing in AP Schools | AP Corona Cases | Covid Latest News
X

ఏపీ స్కూళ్లలో కరోనా టెన్షన్

AP Schools - Corona Tension: ఏపీలో స్కూళ్లకు కరోనా టెన్షన్ పట్టుకుంది. విశాఖ గోపాలపట్నం ఎల్లపు వానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. 23న ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు, ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఎల్లపు వానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు, కొత్తపాలెం చెందిన ఒకరు, సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు పాఠశాల ప్రాంగణంలో, విద్యార్థుల ఇళ్ల దగ్గర శానిటైజేషన్ చేశారు.

Shireesha

Shireesha

Next Story