రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం.. ఖైదీకి కరోనా పాజిటివ్‌

Corona positive at Rajahmundry Central Jail
x

రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం.. ఖైదీకి కరోనా పాజిటివ్‌

Highlights

Rajahmundry: జీజీహెచ్‌లో ఖైదీకి కొనసాగుతున్న చికిత్స

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో కరోనా కేసు నమోదు కావడం కలకలం రేపింది. జైలులోని ఓ ఖైదీకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాకినాడకు చెందిన ఓ వృద్ధుడికి ఈ ఏడాది మే నెలలో శిక్షపడడంతో జైలుకు తరలించారు. అయితే ఈ నెల 17 నుంచి దగ్గు, జలుబు, జ్వరం ఉండడంతో జైలు ఆస్పత్రిలో చికిత్స అందించారు జైలు అధికారులు. 19న జ్వరం తీవ్రం కావడంతో జీజీహెచ్‌కు తరలించి కరోనా టెస్టులు నిర్వహించారు. శనివారం టెస్టు ఫలితం రావడంతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది వృద్ధుడు ఉన్న బ్యారక్‌ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ చేయించారు. ఇతర ఖైదీలకు కరోనా సోకకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఇతర ఖైదీలు, జైలు సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేయిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories