ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
x
Highlights

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహాయం చేసేందుకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహాయం చేసేందుకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. ఏపీ సీఎం సహాయనిధికి పలు సంస్థలు ఎత్తున విరాళాలు అందిస్తున్నాయి. మంగళావారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి చెక్కులు అందజేశారు.. సహాయనిధికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్లు విరాళాన్ని ప్రకటించి.. ఈ మొత్తాన్ని సహాయనిధికి బదిలీ చేశారు. సంస్థ ఎండీ సమీర్‌ గోయల్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కె.సత్యనారాయణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి ఇందుకు సంబంధించిన చెక్కులను అందజేశారు. సీఎం సహాయనిధికి ఏపీ స్టేట్‌ వేర్ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించింది.

అంతేకాదు ఆ సంస్థ ఉద్యోగుల తరఫున 7లక్షల 77వేల 979 రూపాయల విరాళాన్ని కూడా ముఖ్యమంత్రికి అందజేసింది. అలాగే రాష్ట్రంలోని మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలు రూ.50 లక్షల 66వేల రూపాయలు ప్రకటించాయి. మరోవైపు ఏపీ ఆయిల్‌ సీడ్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఆయిల్‌ ఫెడ్‌) రూ.50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

అంతేకాదు ఉద్యోగుల ఒక రోజు వేతనం లక్షా 86 వేల 936 రూపాయలను కూడా విరాళంగా అందించింది.. ఆ సంస్థ చైర్మన్‌ వై.మధుసూదన్‌రెడ్డి, ఎండీ శ్రీకంఠనాధరెడ్డి ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ (ఆప్కాబ్) తరఫున కోటి 16 లక్షల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఉద్యోగుల తరపున కూడా 4 లక్షల 32 వేల 506 రూపాయలను విరాళంగా ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories