Viral Video: సరిగమలతో అలరించిన కానిస్టేబుల్..వైరల్ అవుతున్న వీడియో


Viral Video: సరిగమలతో అలరించిన కానిస్టేబుల్..వైరల్ అవుతున్న వీడియో
Viral Video :పైడితల్లి అమ్మవారి శత వార్షికోత్సవాల్లో సంగీత కార్యక్రమంలో కానిస్టేబుల్ వెంకటరమణ గానం ఆకట్టుకుంది. ఆయన పాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Viral Video :పైడితల్లి అమ్మవారి శత వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ఓ కానిస్టేబుల్ తన గాన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత విభావరిలో ప్రముఖ గాయకుల ప్రదర్శనలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వెంకటరమణకు పాట పాడాలన్న ఆసక్తి కలగడంతో రాజాం సీఐ ఉపేంద్రను కోరారు. ఆయన అనుమతితో వేదికపైకి వచ్చిన వెంకటరమణ ‘శ్రీతుంబర నారద నాథామృతం’ అనే పాటను ఆలపించారు.
సరిగమలను అలవోకగా పాడుతూ ఆయన గానం చేసిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అక్కడ ఉన్నవారు ఆయన ప్రతిభను ప్రశంసించారు. వృత్తిరీత్యా పోలీసు అయిన వెంకటరమణకు సంగీతంపై ప్రత్యేక ఆసక్తి ఉండడంతో స్వయంగా సాధన చేస్తూ వస్తున్నట్లు తెలిసింది.
కోణంగిపాడు గ్రామానికి చెందిన వెంకటరమణ గాన ప్రతిభకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



