నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య

Constable Brutally Murdered in Nandyal
x

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య

Highlights

Nandyal: కత్తులతో నరికి చంపినట్టు గుర్తింపు, రాత్రి పదిన్నర గంటల సమయంలో ఘటన

Nandyal: నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో దారికాచి దారుణంగా కత్తులతో నరికి చంపారు. మృతుడు సురేంద్రగా గుర్తించారు. పట్టణంలోని రాజ్ థియోటర్ సమీపంలో సురేంద్రను దుండగులు అటకాయించి పట్టణ శివారులోని చెరువు కట్ట ప్రాంతానికి తీసుకు వెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. కానిస్టేబుల్ హత్యతో పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories