Congress: నాడు జగనన్న వదిలిన బాణం రేపు జగనన్న మీదకే వస్తుందా..?

Congress Targets Jagan By Using Sharmila
x

Congress: నాడు జగనన్న వదిలిన బాణం రేపు జగనన్న మీదకే వస్తుందా..? 

Highlights

Congress: రెండేళ్ల YSRTP ప్రస్థానం ఇక చరిత్రకే పరిమితం కానుందా..?

Congress: కాంగ్రెస్‌లో షర్మిల చేరడం లాంఛనమేనన్న ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో షర్మిల చర్చలు జరిపినట్లు YSRTP చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఓ స్పష్టత రాగానే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిలను తెలంగాణలో కాకుండా ఏపీలో పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. విభజన ప్రభావం, వైసీపీ ఆవిర్భావంతో కలిగిన నష్టాన్ని వైఎస్‌ఆర్ ఇంటి నుంచే భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే షర్మిల ద్వారా ఏపీలో కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా..? కాంగ్రెస్‌కు దూరమై వైసీపీకి దగ్గరైన వారిని తిరిగి పార్టీ గూటికి షర్మిల చేరుస్తారా..? ట్రబుల్ షూటర్ DK శివకుమార్ చేసిన మంత్రాంగం ఏంటి? DK మధ్యవర్తిత్వంతో అటు షర్మిలకు, ఇటు కాంగ్రెస్ కు కలిగే లబ్ధి ఏంటి..? రెండేళ్ల YSRTP ప్రస్థానం ఇక చరిత్రకే పరిమితం కానుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories