సి.ఏ.ఏ-ఎన్ ఆర్సి పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాల నిరసన ర్యాలీ

సి.ఏ.ఏ-ఎన్ ఆర్సి పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాల నిరసన ర్యాలీ
x
Highlights

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు.

పాయకరావుపేట : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గౌతమ్ థియేటర్ జంక్షన్ నుంచి సూర్య మహల్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది . భారతదేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తే నిరసిస్తామని, మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని, తామంతా భారతీయులమని నిరసనకారులు తెలిపారు. భారత్ బచావో మోడీ హటావో అంటూ నినదించారు. సిపిఐ జిల్లా నాయకులు జె వి ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో దేశమంతటికీ వర్తించే విధంగా ఆధార్ కార్డు ఇచ్చారని ఇప్పుడు మరలా మనుషులందరినీ లెక్క పెట్టి పౌరసత్వం పేరుతో మరొకటి ఇవ్వడం ఏంటని మండిపడ్డారు.

భారత స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొందని, ఆర్ఎస్ఎస్ కానీ ఇప్పుడున్న బిజెపి గాని ఎక్కడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదని వారికి దేశ భక్తి ఎక్కడ ఉందంటూ పాయకరావుపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తాళ్లూరు విజయకుమార్ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన భారత్ పౌరసత్వ బిల్లు మోడీ, అమిత్ షా లు భారత రాజ్యాంగం పై చేస్తున్న దాడిగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఈ నిరసన ర్యాలీ లో పాల్గొనడం జరిగింది అని చెప్పిన సిపిఎం మండల కార్యదర్శి వెలుగుల చెప్పారు.

గతంలో ప్రధానమంత్రి మోదీ విదేశాల నుంచి నల్లధనం తెస్తానని లేకుంటే ఉరితీయండి అంటూ మాట్లాడారు గానీ మోడీ నల్లదనం తీసుకు వచ్చాడా, మనం మోడీని ఉరితీసామా అంటూ ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఈ పౌరసత్వ బిల్లు కూడా ఎవరు అంగీకరించే పరిస్థితి లేదని అర్జున్ రావు తెలిపారు. ''వందలు సంవత్సరాలుగా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇక్కడే చచ్చిపోతాం. మేమంతా భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో మేము అందరూ భారతీయులు గానే కొనసాగుతాం. దేశం విడిచి వెళ్లేది లేదు. మేము అందరం ఈ దేశంలో అంతర్భాగం. మేము చచ్చేంత వరకు ఇక్కడే భారతీయులు గానే ఉంటాం." అంటూ ముస్లిం నాయకులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories