ఏపీ పంచాయతీ ఎన్నికలు.. ఆ గ్రామంలో బోణీ.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. ఆ గ్రామంలో బోణీ.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
x

కాంగ్రెస్ పార్టీ జెండా 

Highlights

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరిచింది. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది హస్తం పార్టీ. వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లిలో...

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరిచింది. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది హస్తం పార్టీ. వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు పోటుగారి భాస్కర్‌ సతీమణి లలిత భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మొండివెంగనల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లలితకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందలు తెలిపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లు దక్కలేదు. కీలక నేతలంతా ఓటమి బాట పట్టడంత ో నైరాశ్యంలో కూరుకుపోయింది. 2019ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్టివిటిస్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిడంతో ఆ పార్టీకి మళ్లీ జీవం వచ్చినట్లయింది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

కాగా.. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2013పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరేవేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరువేల గ్రామపంచాయతీలు కైవసం చేసుకుని తొలి స్థానంలో నిలించింది. 2014లోఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరగలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories