ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సుంకర పద్మశ్రీ

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సుంకర పద్మశ్రీ
x
Highlights

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని స్పీకర్ తమ్మినేని సీతారాంపై మండిపడ్డారు ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. ఆయన...

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని స్పీకర్ తమ్మినేని సీతారాంపై మండిపడ్డారు ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. ఆయన వ్యాఖ్యలపై విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారామె. అనంతరం మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేనిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని స్పీకరా? లేక బ్రోకరా? అని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇష్టంవచ్చినట్టు మాట్లాడటం ఏమిటని అన్నారు. స్పీకర్ వాడిన భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తమ్మినేనిని స్పీకర్ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ పై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబసభ్యులు ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినా బైబిల్ పట్టుకునే ఉంటారని... అలాంటప్పుడు తిరుమల ఆలయంలోకి వెళ్లే సమయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేననిఅన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇస్తే కొత్త ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోనే సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వడం లేదని విమర్శించారు. కొందరు వైసీపీ నేతలకు దేవుడంటే భయం లేకుండా మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories