నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ కేంద్ర మంత్రి

నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ కేంద్ర మంత్రి
x
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి నేడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ మారాలా వద్ద అన్న అంశంపై సోమనవారం...

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి నేడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ మారాలా వద్ద అన్న అంశంపై సోమనవారం సాయంత్రం ఆమె పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలందరు వైసీపీలో చేరాల్సిందిగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. దాంతో మంగళవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకొని జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.

కాగా.. కిల్లి శ్రీకాకుళం ఎంపీ లేదా పలాస ఎమ్మెల్యే టికెట్ లలో ఏదో ఒకటి ఇవ్వాలని అడుగుతున్నారు. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన ఈమె.. కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడిపై 82,987 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాష్ట్ర విభజనాంతరం 2014 ఎన్నికల్లో పోటీచేసిన కిల్లి కేవలం 24,163 ఓట్లకే పరిమితం కాగా.. వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతికి 4,28, 591 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కింజరపు రామ్మోహన్ నాయుడు గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories