Top
logo

వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ నేత

వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ నేత
Highlights

ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్‌ గఫూర్‌ శనివారం వైయస్ జగన్...

ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్‌ గఫూర్‌ శనివారం వైయస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ ను కలిసిన గఫూర్‌ తన క్యాడర్ తో కలిసి ఆ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి కండువా కప్పి.. పార్టీలోకి వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. కాగా కనిగిరి ప్రాంతంలోని మైనార్టీలలో అబ్దుల్‌ గఫూర్‌ కు మంచి పట్టు ఉంది. ఆయన చేరికలో వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ముఖ్య పాత్ర పోషించారు. అబ్దుల్‌ గఫూర్‌తోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వైసీపీలో చేరారు.

Next Story