బీజేపీలో చేరిన కాంగ్రెస్, జనసేన నేతలు

బీజేపీలో చేరిన కాంగ్రెస్, జనసేన నేతలు
x
Highlights

బీజేపీలో చేరిన కాంగ్రెస్, జనసేన నేతలు బీజేపీలో చేరిన కాంగ్రెస్, జనసేన నేతలు

ఏపీలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్,జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. కడప జిల్లాలో మైదుకూరు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మల్లికార్జున మూర్తి, కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్‌ పాలడుగు డేవిడ్‌ రాజు బీజేపీలో చేరగా.. 10 మంది న్యాయవాదులు కూడా బీజేపీలో చేరినవారిలో ఉన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..

బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని, ప్రభుత్వపరంగా మోదీ, పార్టీ పరంగా అమిత్‌ షా కలిసి నడిపిస్తున్నారన్నారు.రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీలతో ప్రయోజనం లేదని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో చాలా మంది తమపార్టీలో చేరతారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని కన్నా జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories