Visakhapatnam: ఆన్‌లైన్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయ క్లాసులు

Visakhapatnam: ఆన్‌లైన్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయ క్లాసులు
x
Highlights

దేశంలోని కేంద్రీయ విద్యాలయ (కేవీ)ల్లో ఆన్‌లైన్‌లో క్లాసులు ప్రారంభం కానున్నాయి.

విశాఖపట్నం: దేశంలోని కేంద్రీయ విద్యాలయ (కేవీ)ల్లో ఆన్‌లైన్‌లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటన్‌ ప్రత్యేక ప్రోటోకాల్‌ రూపొందించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈమెయిల్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ లెర్నింగ్‌ ఫర్‌ సెకండరీ(ఎన్‌ఐఓఎస్‌) ద్వారా రికార్డు చేసిన పాఠాలు, లైవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వయం ప్రభ పోర్టల్‌లో ఏప్రిల్‌ 7 నుంచి సీనియర్‌ సెంకండరీ క్లాసెస్‌ ప్రారంభవుతాయని వెల్లడించారు.విద్యార్థులకు ఏదైనా సందేహం వస్తే స్కైప్‌, లైవ్‌ వెబ్‌ చాట్‌ సహాయంతో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories