Top
logo

రహదారులు విస్తరించే పని త్వరగా పూర్తి చేయండి

రహదారులు విస్తరించే పని త్వరగా పూర్తి చేయండి
X
Highlights

మండలంలో ప్రధాన ఆర్.అండ్.బి, పంచాయతీ రాజ్ రోడ్ల ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి రహదారులను విస్తరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.

కిర్లంపూడి: మండలంలో ప్రధాన ఆర్.అండ్.బి, పంచాయతీ రాజ్ రోడ్ల ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి రహదారులను విస్తరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. అన్నదే తడవుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబును అలాగే కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి అయినా ముద్రగడ పద్మనాభంను యొక్క నివాసాలకెళ్లిన గుడా అధికారులు. రహదారులను విస్తరించే పద్ధతిని వారిరువురి నేతలకు క్షుణ్ణంగా వివరించారు.

అందుకు స్పందించిన ఉద్యమనేత ముద్రగడ, గుడా అధికారులతో రహదారిని విస్తరించేటప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను కోరారు. అధికారులెవరయినప్పటికీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ముద్రగడ సూచించారు. తాను గాని తన అనుచరులు గాని రోడ్లు విస్తరించేటప్పుడు ఏ విధమైన అభ్యంతరాలను చెప్పభోమని ముద్రగడ గుడా అధికారులు హామీ ఇచ్చారు.

అలాగే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా బాటసారులకు ప్రజా జీవనానికి ఎటువంటి అవరోధం కలగకుండా త్వరగతిన రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని గుడా అధికారులకు హుకుం జారీ చేశారు. రహదారులను కిర్లంపూడి మండలంలో విస్తరించేందుకు గుడా అధికారులు చర్యలు చేపడుతున్నారన్న సమాచారం అందుకున్న రహదారుల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Web TitleComplete road widening quickly in Kirlampudi says Mudragada Padmanabham
Next Story