Coronavairus: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాయిదా పూర్తి సమాచారం!


ప్రపంచాన్ని గడగడలాదీస్తున్న కరోనా వైరస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ తన ఉనికిని ప్రదర్శించింది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
ప్రపంచాన్ని గడగడలాదీస్తున్న కరోనా వైరస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ తన ఉనికిని ప్రదర్శించింది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.నివారణే తప్ప మందు లేని ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కునేందుకు అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ వాయిదా విషయమై ఉన్న అనుమానాల నివృత్తి కోసం పూర్తి సమాచారం అందిస్తున్నాం..
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేస్తు రాష్ట్ర ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆరు వారాల పాటు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మార్పులు:
స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తున్నప్పటికీ ఇప్పటికే జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేవని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 21వ తేదీనా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల ప్రక్రియ తో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ కూడా ముగియడంతో రాష్ట్ర ఈసీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏకగ్రీవ స్థానాలు ఎన్నికలు అవసరం లేదు కాబట్టి ఆ స్థానాలు మినహా విగతా స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జెడ్పీపీ, ఎంపీపీ, విడుదల చేసిన నోటిఫికేషన్లు అవసరమైన మేరకు సవరిస్తామని తెలిపారు.
మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు:
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ మార్చి 23, కౌంటింగ్ 27న నిర్వహించాల్సి ఉంటుంది. మార్చి 11 నుంచి 13 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అలాగే పంచాయతీ ఎన్నికల రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణించారు. మార్చి 27న మొదటి దశ మార్చి 29న రెండో దశలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం జరగనున్న స్థానిక ఎన్నికల్లో దాదాపు రెండు కోట్ల మందిపైగా ఓటర్లు హాజరుకానున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరే అవకాశం ఉంది. ఎన్నికలు పేపర్ బ్యాలెట్స్ ద్వారా నిర్వహిస్తారు. దీనికి అధిక సమయం పడుతుంది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తియినా... ఓట్లేసే ఓటర్లు క్యూ లైన్ లో నిలబడతారు. వారికి ఎవరికైనా కరోనా మహమ్మారి లక్ష్యణాలు ఉంటే అది ముప్పుగా మారే అవకాశం ఉంది. దీంతో ప్రజారక్షణ పణంగా పెట్టకూడదనే వాదనతో ఈసీ ఏకీభవిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నిలకు వాయిదాకు నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు మేరకు సవరిస్తామని తెలిపారు. ఆరు వారాల తర్వాత పంచాయతీ ఎన్నికలకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాం అని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.
నిలిపివేత మాత్రమే. రద్దు కాదు:
విధిలేని పరిస్థితుల్లో ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పంచాయతీ రాజ్ చట్టం ద్వారా సంక్రమించిన విచక్షణ అధికారాల మేరకు స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నామని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇది కేవలం వాయిదా మాత్రమే తప్ప రద్దు కాదని తేల్చి చెప్పారు. అలానే ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని రమేష్ కుమార్ తెలిపారు.
మళ్లి ఎన్నికలు ఎప్పుడంటే:
ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ ఎన్నికల రద్దు కాదని, తాత్కాలికంగా వాయిదా వేసినా ఆరు వారాల తర్వాత మళ్లి సమీక్షిస్తామని, అప్పుడు పరిస్థితులను బట్టి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
ఎన్నికల కోడ్:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా.. ఎన్నికల నియమావళి మారదని రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు నిషేదం కొనసాగుతుందని తెలిపారు. ఉగాది నాడు ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఈసీ వాటిపై అభ్యంతరం తెలిపింది. దీంతో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. అంతే కాకుండా కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలు ప్రభుత్వ పథకాలపై కూడా నిషేదం కొనసాగుతుందని మరోసారి ఈసీ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్యక్రమాలకు అభ్యంతరాలు లేదని తేల్చి చెప్పింది.
ఎన్నికల రద్దు టీడీపీ డిమాండ్:
గత కొంత కాలంగా ఎన్నికలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కరోనా వైరస్ విజృభిస్తున్న వేళ ఎన్నికలు జరిపితే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కరోనా ముప్పు ఉండే అవకాశం ఉందని టీడీపీ వాదిస్తూవస్తుంది. నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చిందని, ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. కరోనా కేసు నమోదైన నెల్లూరులో పాఠశాలలు, థియేటర్లు మూసివేశారని సోమిరెడ్డి గుర్తు చేశారు. ప్రజల రక్షణ కంటే ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. నామినేషన్లు ఒక్కటే పూర్తయ్యాయని, ఎన్నికలు తేదీ వాయిదా ఏం మునిగిపోదని తెలిపారు. కరోనా వైరస్ వలన ప్రజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాద్యత వహించాలని టీడీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



