తుది నివేదిక తొందర్లోనే.. హై పవర్ కమిటీ ప్రకటన

తుది నివేదిక తొందర్లోనే.. హై పవర్ కమిటీ ప్రకటన
x
Highlights

పలువురి మరణాలకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను తొందర్లోనే సిద్ధం చేస్తున్నామని, వాటిని వెంటనే ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ...

పలువురి మరణాలకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను తొందర్లోనే సిద్ధం చేస్తున్నామని, వాటిని వెంటనే ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ చైర్మన్ చెప్పారు. మే నుంచి సాగుతున్న కమిటీ విచారణ తొందర్లోనే ముగియనుందన్నారు.

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్, పబ్లిక్, వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామని పేర్కొన్నారు.

దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇతర రెగ్యులేటరీ అథారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మే నెలలో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు.

జూన్ 15న ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలియజేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories