Alluri District: రోడ్డు మార్గం లేకపోవడంతో కాలినడకన వెళ్లిన కలెక్టర్, ఎంపీ

అల్లూరి జిల్లా కితాబు గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ సుమిత్, ఎంపీ మాధవి

Rama Rao
Published on: 7 Jun 2022 8:51 AM IST
Collector Sumit And MP Madhavi Visiting Kitabu village in Alluri District
X

Alluri District: రోడ్డు మార్గం లేకపోవడంతో కాలినడకన వెళ్లిన కలెక్టర్, ఎంపీ

Alluri District: అల్లూరి జిల్లా కితాబు గ్రామాన్ని కలెక్టర్ సుమిత్, ఎంపీ మాధవి సందర్శించారు. రోడ్డు మార్గం లేకపోవడంతో కాలినడకన వెళ్లారు. వర్షం పడుతున్నా రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. వాగులు, వంకలు దాటుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. కితాబు గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో ఐదుగురు చిన్నారులు చనిపోయారు.

ఈ విషయాన్ని గ్రామస్తులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్, ఎంపీ గ్రామానికి చేరుకొని సమస్యలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ భవనం, ప్రాథమిక పాఠశాల మంజూరు చేయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు వీరిద్దరూ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిర్మాణాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story