Nellore: పవర్ జనరేషన్ సమయంలో కూలిన హోపర్స్‌.. నిలిచిన విద్యుదుత్పత్తి

Collapsed Hoppers During Power Generation In Nellore
x

Nellore: పవర్ జనరేషన్ సమయంలో కూలిన హోపర్స్‌.. నిలిచిన విద్యుదుత్పత్తి

Highlights

Nellore: వరుస వైఫల్యాలతో ఏపీ జెన్‌కోకు భారీ నష్టం

Nellore: నెల్లూరు జిల్లా నేలటూరు జెన్కో థర్మల్ పవర్ ప్రాజెక్టులో హోపర్స్ కూలిపోయింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఏడాది కాలంలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తడం ఇది రెండోసారి. ఒకవైపు కాన్వేయర్ బెల్టులు... తెగిపోవడం.. మరోవైపు కోల్ సరఫరాలో ఇబ్బందులు.. ఇంకోవైపు హోపర్స్ కుప్పకూలిపోతూ ఉన్నప్పటికీ జెన్కో ఉన్నతాధికారులు కనీసం స్పందించలేదని.. ఆరోపణలు వెల్లువత్తుతున్నాయి. వరుసగా ఏడాది కాలంలో రెండుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ దానిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేప్టకపోవడంతో హోపర్స్ కూలినట్టు తెలుస్తుంది.

దీంతో మరోసారి ఏపీలో విద్యుత్ కష్టాలు తప్పవు అన్న భావన వ్యక్తమవుతోంది. గత కొంత కాలంగా థర్మల్ ప్లాంట్‌లో పదేపదే సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల జెన్కోకు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories