Visakhapatnam Port: వైజాగ్ పోర్ట్‌లో పేరుకుపోయిన బొగ్గు నిల్వలు

Coal Stockpile At Visakhapatnam Port
x

Visakhapatnam Port: వైజాగ్ పోర్ట్‌లో పేరుకుపోయిన బొగ్గు నిల్వలు

Highlights

Visakhapatnam Port: దీంతో కొనుగోలుకు నోచుకోని 1.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు

Visakhapatnam Port: విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఏకంగా 1.4 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ ధరతో పోలిస్తే.. తక్కువ ధరకు దేశీయ బొగ్గు లభిస్తుండడంతో విదేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బొగ్గు ధరలలో వ్యత్యాసం కారణంగా కొనుగోళ్లు ఆగిపోయాయి. దీంతో 1.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు కొనుగోలుకు నోచుకోలేదు. మరో రెండు రోజుల్లో ఇంకో లక్ష టన్నులు దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రేడర్స్, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర కంపెనీలకు అవసరమైన థర్మల్, కోకింగ్, స్టీమ్ బొగ్గును విశాఖపట్నం ట్రస్ట్ నిర్వహిస్తుంది. సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల థర్మల్, 7 మిలియన్ టన్నుల కోకింగ్, 10 మిలియన్ టన్నుల ఆవిరి బొగ్గు నిర్వహణ కార్యకలాపాలు జరుగుతాయి. పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్‌లో బొగ్గు వాటా దాదాపు 25 నుంచి 30 శాతం. విశాఖ నుంచి కొందరు విక్రేతలు.. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని పోర్టులో నిర్వహించి ఆయా పరిశ్రమల డిమాండ్ మేరకు విక్రయిస్తున్నారు. అయితే కొన్ని నెలలుగా పోర్టులో బొగ్గు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories