Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొత్త సమస్య

Coal Shortage in Vizag Steel Plant makes Burden 500 Crore Extra | AP Latest News
x

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొత్త సమస్య

Highlights

Vizag Steel Plant: విదేశీ బొగ్గును కొనుగోలు చేస్తున్న ప్లాంట్‌ అధికారులు...

Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలతో నెట్టుకువస్తోంది. దీనికి తోడు బోలెడన్నీ సమస్యలు. ఇప్పుడు కొత్తగా బొగ్గు కొరత కూడా స్టీల్‌ ప్లాంట్‌కు భారంగా మారింది. నెలకు 5వందల కోట్లు అదనంగా భరించాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు సరఫరా ఎందుకు నిలిపి వేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తుందా.. ఇంతకీ స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు ఏమంటున్నాయి.

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది విశాఖ ఉక్కుపరిశ్రమ పరిస్థితి. అసలే బోలెడన్నీ సమస్యలతో నెట్టుకువస్తున్న ప్లాంట్‌కు కొత్తగా బొగ్గు కొరత కొత్త ప్రాబ్లమ్‌ని తెచ్చిపెట్టింది. బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో విదేశీ బొగ్గును వినియోగించాల్సి వస్తోంది. సంస్థకు ప్రతి నెలా సుమారు 23 వరకు రేకులు వస్తాయి. ఈ బొగ్గును ఒడిశాలోని బొగ్గు క్షేత్రాల నుంచి అధికారులు కొనుగోలు చేస్తారు.

అయితే దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం తలెత్తడంతో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. పరిశ్రమలకు పంపించే బొగ్గును ఉన్నపలంగా నిలిపివేశారు. బొగ్గు నిల్వలు కూడా నిండుకున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను నడిపించడానికి కర్మాగార అధికారులు విదేశీ బొగ్గును వినియోగించాల్సి వస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు సుమారు 4రెట్లు పెరిగాయి. దీంతో సంస్థపై కొనుగోలు భారం పడింది. తాజా పరిణామాలతో సంస్థపై ప్రతి నెలా సుమారు 500 కోట్ల భారం పడుతుందని పరిశ్రమ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఉక్కు పరిశ్రమకు దేశీయ బొగ్గును సరఫరా చేస్తే.. కాస్త భారం తగ్గనుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

బొగ్గు సరఫరా విషయంలో ప్రభుత్వ రంగ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఉక్కు కర్మాగారం నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఇనుప ఖనిజం ధరలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు బొగ్గును కొరత అదనపు భారంగా మారిందటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కావాలనే కృత్రిమ కొరత సృష్టించిందని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories