రేపు ధర్మవరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్

రేపు ధర్మవరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(శనివారం) అనంతపురం జిల్లాకు వెళతారు. ధర్మవరంలో జూనియర్ కాలేజీ మైదానంలో వైయస్ఆర్ నేతన్న నేస్తంను...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(శనివారం) అనంతపురం జిల్లాకు వెళతారు. ధర్మవరంలో జూనియర్ కాలేజీ మైదానంలో వైయస్ఆర్ నేతన్న నేస్తంను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనతకుముందు ధర్మవరం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్ లను సందర్శిస్తారు. ఆ తరువాత నేతన్న నేస్తం ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎం శంకర నారాయణ గురువారం సమీక్షించారు.

సభకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 20 వేల మంది దాకా జనం వస్తారని అంచనా వేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా పోలీసులకు శిక్ష ఇచ్చారు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు. కాగా మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య యేసుబాబు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories