జిల్లాలో 2వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి

జిల్లాలో 2వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి
x
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
Highlights

జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నుండి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.

కడప: జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నుండి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. తొలి రోజు సుమారు 2 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిలో నిర్మించిన ఆర్వోబీని కూడా ప్రారంభించనున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో సుమారు 454.63 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

107 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి తో పాటు పరిశోధన కేంద్రం, 175 కోట్లతో సూపర్ స్పెషాలిటీ విభాగం, 25.85 కోట్లతో సైకియాట్రీ విభాగం, 55 కోట్లతో దేవుని కడప చెరువు అభివృద్ధి, 3.85 కోట్లతో రాజీవ్ మార్గ రహదారి, 5.20 కోట్లతో గూడూరు గ్రామ పరిధిలోని మైనార్టీ బాలుర వసతిగృహం, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి క్యాంపస్ పేరుతో ఎల్.వి.ప్రసాద్ కంటి వైద్యశాల, రిమ్స్ ప్రాంగణంలోని సహాయకుల భోజన వసతి గృహాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories